పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

విజయనగర సామ్రాజ్యము


రామరా జేమియుఁ జెప్ప లేదు. కాని, యతని మనసు మాత్ర మూరకుండ లేదు. ఏమేమోయోజంచుచు నేయుండెను. ఆదిల్ శాహా చెప్పిన వాక్యములను విశ్వసింపక సర్వము నసత్య మని తలపోయుచుండెనా ? పుత్రుని మాటలను నమ్మకుండు నా రెవ రేనిగలరా! అతఁడొక నిట్టూర్పు విడిచెను. అతని యధరాగ్రములనుండి యీ క్రింది మాటలు వెల్వడెను . హిందువుల కష్టము లెన్నటికిని గట్టెక్కవు. మూఁడు నాల్గు వందల వత్సరములనుండి వారు పడుచున్న కష్టములు 'దైవమున కెఱుక. ఎక్కడనో మీవంటి సత్స్వభానముగల రాజు తక్క దక్కిన ముసల్మాను రాజు లెల్ల హిందువులను పెక్కు బాధలు పెట్టి హింసించుచున్నారు. ఇది యంతయును, ఇట్లు కానలయునని దేవుని సంకల్పమే యై యుండవలయును. కాకున్న చో నిట్లు జఱుగునా ! పరాత్పరుఁడు ప్రజలకుఁ గష్ట ములు వచ్చు వేళ నవతారము లెత్తి రక్షించునని వాఁడుక . అత డిట్లు బాధపడుచున్న హిందువుల నుద్ధరించి ధర్మరక్షణ మేల చేయఁడో?"

ఆద్:-అవును. శాంతస్వభావులగు హిందువులు మహమ్మదీయుల వలసఁ జాలఁ బాట్లుపడినారు. ఆ పాపఫలమును వీరనుభ వింపక తీరదు దేవుని యవతారములు తమవంటివారే. తప్పక తమరే ధర్మరక్షణకుఁ బూనుకొనవలయును. నేను మహమ్మదీయుఁడ నయినను నాకు హిందూమతము నందుఁ