పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము

26

.

రామ: అవును, తారానాధుని పేరు వినియుంటిని. అతఁడు. రాజకార్య నిర్వహణమున మిక్కిలి నేర్పరియఁట.పాపము! తరువాత నతనిగతి యేమయినది ?

ఆది:-అతఁడందుల కిష్టపడ లేదు. దాని పై సవాబు కోపించి తారానాధుని, అతని భార్యను బిడ్డలను, జెఱసాలలోనుంచి హింసింప నారంభించెను. పాపము! మంత్రిమాత్రమట్టి స్థితిలో నెట్లో తప్పించుకొని కార్యమును సాధింప సస్య దేశ మేగి నట్లు తెలిసినది. భార్యకు బిడ్డలకుమాత్రము పాట్లు తప్పి, సవికావు . . . . . .ఛీ ! ఇట్టి రాజును ముక్కలుగాఁ గోసి నను బాపము లేదు. రాజు లే యిట్లు ప్రజలను హింసించిన నిఁకఁ జలకు దిక్కెవరు?

రామ: హరహర ! ఎంతపని చేసినాఁడు ! అతని కంత్యకాలము. ప్రాప్తించియుండును.

రామరాజు మొగము కొంచె మెఱవడియెను. దానిని అదిల్ శాహా కని పెట్టి, 'హిందువులుదారస్వభావులు. పాప దూరులు. మా మహమ్మదీయు లట్టివారు కారు. ఎన్ని యో విజయములుగాంచినను, ఒక్క హిందూరాజైన నిట్టి యకార్య మును జేయ లేదు, ఇంక మావారో, ఒక్క నాడొక్క చిన్న విజయము ప్రాప్తించిన నుబ్బి గుళ్లు గూల్చి, యూళ్లుగాల్చి, మనుజుల పచ్చిర క్తములఁ బీల్చెదరు, ధర్మమని యధర్మమని విచారింపరు' అనెను.