పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

విజయనగర సా మ్రాజ్యము


ధర్వ భామినులా ? మఱెవరు? నయన సుభగములై యొప్పా రుచు, సకలవిధ కుసుమఫలా కీర్ణము లైన యీ యుద్యాన వన ముల ప్రకృతి సౌభాగ్యమును విడిచి పెట్టుటకు మా మనసొప్పు చున్న దా! ఆహా! అటుచూడుఁడు ! సాయంతన వినోద కేళీ విహారార్థమై వచ్చి సౌధోపరిభాగముల నిటునటు తిరుగుచున్న యూచపలాతుల మొగము లెంత మనోహరములుగా నున్న వి! బంగారు. తేటవలె భాసిల్లుచున్న వారి మొగముల పై కెట్లు మందమారుత ప్రేరణమున ముంగురులు వ్యాపించు చున్నవో చూడుఁడు ! ఇదిగో, చెటాపటీలు పట్టుకొని షికార్లు సేయుటకుఁ బోవుచున్న యీవయసుకాండ్ర విలాసము, సౌం దర్యము, చాకచక్యము నవలోకింపుడు ! అల్ల దిగో, ఆ వర్తక స్థానములఁ జూడుఁడు! రత్నములు, మణులు, ముత్యములు, గుట్టలు గుట్టలు !

“వక్ర: పక్షాయ దపి భవతః ప్రస్థిత స్యో తరాణాం
తీరోత్సంగ ప్రణయ విముఖో మాస్మ భూరుజ్జ యిన్యాః”


నగర సామాన్యమగు నుజ్జ యినికే యింతగా నుబ్బి తబ్బిబ్బయిన కాళిదా సీనగరముం జూచెనేని యేమగునో ? ఎచ ట: జూచినను గీతములే ! మృదు మధురగానము లే ! సౌందర్య మే ! సౌభాగ్య మే, హు మే! ఇది యేమి ? స్వర్గమా ! భూ లోకమా ! యక్షలోకమా? మ ఱేమి ! ఏమి, ఆ ప్రాసాదములు! రాచబాటలు! వీధులు! నాటక శాలలు! సంగీత శాలలు!