పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

viii

ఆంధ్ర భాషాభివర్ధనీ ప్రచురములు.

దేశాభ్యుదయమున కావశ్యక మగువిషయములం దెల్లఁ బరిశ్రమ జరుగు చున్న యిక్కాలమున భాషాభివృద్ధి కగ్రస్థానమిచ్చుట ప్రధానమైయున్నది. సంఘము యొక్క సర్వావస్థలయందును, దేశముయొక్క అన్ని భాగముల యందును, విజ్ఞానము ప్రచురింపఁ జేయుటకు భాషా సేవయే ముఖ్య సాధనము . సనాత నాధుని కేతిహాసములు, ప్రకృతి సాస్త్రములు, అన్య దేశాదర్శనిక గ్రంథ ములు, మహాపురుష జీవితములును , గణిత శాస్త్రములు, రాజనీతిశాస్త్రములు," ఆర్థిక, శాస్త్రములు, వృత్తులును, పరిశ్రమలును, వాణిజ్యమును నడుపు విధమును తెల్పు గ్రంథములు, నవలలు లేని లోపములను ఆంధ్ర భాషాభివర్ధనీ సంఘము బ్రయత్నించు చున్నది. ఈ కంపెనీ మూలధనము రూ. 10,000.


2. భారతధర్మ దర్శనము

నిర్మల దేశాను రాగమును ప్రబోధించు పద్య కావ్యము. సుప్రసిద్ధుఁడగు నొక యధునిక కవివరునిచే మృధుమధురముగ గానము చేయఁబడిన 199 పద్యము లిందుగలవు. వెల రూ. 0-2.0. శాశ్వత చందా దారులకు రూ. 0-1-6


2. పీష్వా - నారాయణ రావు కథ.

గ్రంథకర్త. వి.రామదాసుపంతులు గారు, బి.ఏ., బి.ఎ.5 • హైకోర్టు పకీలు. ద్వితీయముద్రణము. మూడు చిత్ర పటములుగలవు. వెల, రూ. 0-2-0, చందాదారులకు రూ. 0_1_6


8. స్వాతంత్ర్య దర్శనము.

గ్రంధకర్త:-దుగ్గిరాల- రామమూ ర్తిపంతులు గారు, బి.ఏ., ఎల్'. టి.

జాన్ స్టూఆర్టు మిల్లు అను ఆంగ్లేయ పండితోత్తముని లిబర్టీ అను సుప్రసిద్ధ గ్రంథము యొక్క భాసాంతరీకరణము. మనోవాక్స్వాతంత్ర్యము, వ్యక్తి స్వాతంత్ర్యము, స్వాతంత్ర్య పరిమితి "మొదలగు సాంఘిక శాస్త్రసిద్ధాం తము లీ గ్రంథమునందు చరిత్రోదంతములద విమర్శింపఁబడినవి). కాలిలో కవరు 175 ఫుటలు. రూ. 0-12-0 చందాదారులకు రూ. 0_7_0.