పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

THE TELUGU ENCYCLOPÆDIA.

ఆంధ్ర విజ్ఞాన సర్వ స్వము


ముఖ్య సంపాదకుఁడు: కే. వి. లక్ష్మణరావు, ఎం. ఏ.

1913 సం|| జూలై మొదలు డబిల్ క్రౌన్ 8 ఆకార మున నెలకు 100 పుటల వంతున ఈ 'విజ్ఞాన సర్వస్వము' వెలు వడు చున్నది. మీకు సాధారణముగ నేవిషయమును గూర్చి తెలియవలె సన్నను ఈగ్రంథమును ద్రిప్పిన చాలును. దేశముల చరిత్రలు, మహా పురుషుల జీవితములు, జంతు జీన పదార్థవిజ్ఞాన రసాయన 'మొదలగు సర్వ ప్రకృతి శాస్త్రములును వానిలోని ముఖ్యవిషయములును, వేదవే దాంగ పురాణేతిహాస విషయములును,వడ్రంగము,కమ్మరము, పింగాణీ, "నేత మున్నగు కర్మల విషయములును, శిల్పము గాన విద్య మున్నగు కళావిద్యలును, వైద్యము 'లా' మున్నగు లౌకిక విషయములును, అవి యివి యన నేల ? పాకశాస్త్ర విషయములతో . గూడ అన్ని విషయములును అకారాదిగ నీ విపుల గ్రంథమందు నర్తింపఁబడును. విషయములు బోధ పడుటకు పటము లనేకములు గూర్పఁబడును. చందా సంవత్సరమునకు పది రూపాయలు.


దీనిని 'రెండు భాగములుగ ఆరుమాసముల కొక పర్యాయము వసూలు చేసికొందుము. ప్రథమసంచిక నంపి మొదటి ఆరు నెలల చందాక్రింద అయిదు రూపాయలు వసూలు చేసికొన గలము. ఐదుసంచికలు వెలువడినవి.


తెలుఁగు ఎక్ సైక్లోపీడియా ఆఫీసు,

చింతాద్రి పేట, మద్రాసు,