పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నలువది రెండవ ప్రకరణము

307


పాపము ! చక్రధర తారానాధులు మొదటినుండి కష్టపడిరి. తంత్రములంబన్నిరి. రాజ్యలక్ష్మీ లోభులై కుడువ రాని కూళ్ళెల్లం గుడిచిరి. పడరాని పాట్లెల్లంబడిరి. కానివారిశ్రమ మాత్రము పాపము ఫలించినది కాదు ! వారు పట్టాభి షేకము యాతురఁబడుచుండిరి. నవాబులు దర్బారుచేసిరి. అందు గోల్కొండ నవాబిట్ల నెను.

ఈ యిరువురును గొప్పతంత్రజ్ఞులు. వీరిని నమ్మియుండుట మనకు క్షేమము కానేరదు. ఇందుఁ జక్రధరుఁడు బంధువుఁడై యుండియు రామరాజునకు స్వామి ద్రోహము చేసిననాఁడు. ఇట్టివానిని సమ్మిన మనలనుగూడ రేపిట్లే చేయును. తారా నాధుఁడు కూడ నట్టివాఁడే. కావున వీరి నిరువురను గుండ్ల బారు లత " నాశము చేయుట మేలు.”

సవాబు లందఱు దీనికి సమ్మతించిరి. నిండుసభ యెదుట వా రిరువురను దుపాకులతోఁ గాల్చిరి. ఆ పాపాత్ముల కిట్టి శిక్ష తగదన నెవరు సాహసింతురు ?

స మాప్తము


PRINTED AT THE INDIA PRINTING WORKS, MADRAS.