పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నలువది రెండవ ప్రకరణము

ఉపసంహారము

"గార ఉత్కృష్ట సామ్రాజ్యములలో నొక్కటియై శత్రుభీక రమై, విఖ్యాతింగాంచిన విజయనగర సామ్రాజ్యము నేఁటితో నంతమైనది. జగద్విఖ్యాత మహానగరములలో నొక్కఁడయిన విజయనగర పట్టణ "మొక్క పెట్టునఁగూలినది. అట్టి మహానగర మా కాలమున నెం దేనింగలదా? ఆదివ్యభ వసములు, ఆ ప్రాకార ములు, ఆ గోపురములు, ఆ నాటక శాలలు, పుస్తక 'బాండాగార ములు, అన్నియుం దురకలచే నాశము చేయంబడను. హిందూ సుందరీ మణులం జెఱ పెట్టవలయునని తురకలందుఁ బ్రవేశించిరి. కాని యొక్క సుందరియు వారికిఁ జిక్క లేదు. కొంద రాత్మ హత్య చేసికొనిరి. మఱి కొందఱగ్ని గుండములంబడిరి. గోల్కొండ నవాబు విజయనగరముం బ్రవేశించిన తరువాత జగన్మోహిని కొఱకు ప్రతిభవనమునను, ప్రతివీధిని, ప్రతిచోటను, ఆ మహానగరమున వెదకించెను. కాని యతడు విపల మునోర ధుఁడాయెను. అతని కామెజాడయే తెలిసినది కాదు. పాపము ! చింతాక్రాంతుఁడై చాలకాలము పర దేశములంగూడ ,వెదకిం చెను. కానియంతయు వ్యర్థమాయెను.