పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నలువది యొకటవ ప్రకరణము

బుద్ధిసాగరుడు

ఆరిపోవనున్న దీపమునకుఁ గాంతి విస్తారమగును. అది స్వభావసిద్ధము. తిరిగి యది విజృంభించి చిరకాలముండునని మనము భ్రమింతుము. కాని యట్లది యెన్నటికిం గూడఁ గాఁజూలదు.


రామరాజటలు యుద్ద భూమినుండి యెచటికో కొనిపోవఁ బడెను. అతనిం గొంపోయినది యోగివరుఁడు. ఆయోగివరుఁ డాతని నొకశిబిరమునకుం గొనిపోయి యందుంచి పెక్కు, సపర్యలు చేయుచుండెను. సేదతీర్చుచుండెను. కాని స్మృతి రాలేదు. ఇంకను రాలేదు. అతఁడు పాపము వృద్ధుఁడు !


కాని యేట్ట కేల కతనికిం గొంచెము స్మృతివచ్చెను. అతడు తన జీవిత మింక నిల్వదని గ్రహించెను. అతని మాన సము చింతాసమాకులాయెను. అచ్చట నా యోగితప్ప మరెవ్వరును లేరు. అతఁడొకసారి బుద్ధిసాగరుం జూడవలయ సని తలంచెను. తనకోరిక గగనకుసుమము వంటిదని యతఁడు. చింతించెను.


మానవులకు ప్రొస్వదృష్టి స్వభావసిద్ధము. ఆ హ్రస్వదృష్టి దూరమును యోచింపనీయదు. యోచన లేక యేది.