పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

300

విజయనగర సామ్రాజ్యము

300

'హా! ప్రాణేశ్వరీ ! హా ! జగన్మోహినీ ! హా! నాప్రా ణమా ! హా ! నా ముద్దులగుమ్మా ! హా ! నారీరత్నమా! హా ! త్రిలోకసుందరీ! అయ్యో! నీవేనా నాకొఱకుఁ బ్రాణము లర్పించుచుంటివి ! యర్దాంగీ! ఆంధ్ర సామ్రాజ్య రక్షణకొజకు నీ ప్రాణముల నర్పించుచుంటివా ! నీ ఋణము నెట్లు తీర్పఁ గలను ? అయ్యో! నీ దేహమెల్ల నెట్లు దుర్బలమైనది? రక్త మెల్ల నెట్లు నశించినది ! హా! అర్థాంగీ ! నీవేకదా నాప్రాణ మవు ! నీచావు నేనుజూడఁగలనా'. హా! ప్రేమైక నిధానమా ! నీ మృదుమధురవాక్కు వినంబడదేమి ? అయ్యో ! యుద్ధ మునకు వత్తునని బతిమాలిన వలదంటిని. కాని నీవు రాక మానవయితివి. అయ్యో ! సుకుమారగాత్రీ ! చంపకదళనేత్రీ! మాట్లాడవేమి?” అని యేడ్చుచు మూర్ఛిల్లెను.


కాని యతఁడు మరల వెంటనే మూర్ఛనుండి లేచెను. ఆమె యొక్క నమస్కృతి చేసెను. విజయ సింహుఁ డామె బాష్పములం దుడుచుచుండెను. ఆమె యేమేమో సంస్మరిం చెను. ఒక సంజ్ఞ చేసెను. అతఁడది గ్రహించి యొక్క ముద్దుఁ బెట్టుకొనెను.


ఆమె హృదయము సంపూర వికాసముసందెను. ఆ ముద్దామెకుఁ బరిపూర్ణ సంతోషము నొసంగెను. ఆమెకండ్లు తోడనే కృతజ్ఞ తందెలి పెను. కన్నుల నొక సారి యొత్తి తెర చెను. అతఁడు దుఃఖవివశుఁడయెను. వా రిరువురి కనుదమ్ము లొక్కపరి ముకుళించెను.