పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

290

విజయనగర సామ్రాజ్యము


ఆమాటలు వినఁగనే ప్రతాపసింగు హృదయమునఁ బశ్చాత్తాపము జనించెను. క్రోధము హెచ్చెను. అతని తప్పు నతని యంతరాత్మ యొప్పుకొనెను. అచ్చట యోధులు సేనా పతులు గలరు. వారలందఱ ముందటి మాటల సనిపించుకొని బ్రదుకుటకంటె నీచత మఱియుండఁజాలదని తలచెను. అతని కన్నులనుండి నీరు బొటబొటం గారుచుండెను. " అయ్యా ! నేను మాతృదేశ ద్రోహిని. పాపాత్ముఁడను. హీనుఁడను. స్వామిద్రోహిని' అని తోడనే తన ఖడ్గమును దీసి కంఠమునం గ్రుచ్చుకొని ప్రాణములు విడిచెను.


కాని యతఁడు యుద్ధభూమికి రాకయుండుటవలన వేంకటాద్రి సైన్యములో నొక గొప్ప భాగము నష్టమును వహిం చెను. సైన్యాధిపతులు లేని సైన్యములు నాయకుఁడు లేని రాజ్యములవంటివి. యజమానులు లేని గృహములవంటివి. చక్రములు లేని శకటములవంటివి. అట్టిస్థియే వేంకటాద్రి సైన్యమునకును గిల్లెను. అది చెల్లా చెదరగుచుండెను.


ఈతని సైన్యములు మధ్య భాగమున నున్నవని మన మెఱుంగుదుము. ఆభాగముననే తురుష్కులు ఫిరంగలను భూమి లో నమర్చియుండిరి. ఆ ఫిరంగుల దెబ్బలచేతను, వాని మహాగ్ని జ్వాలలచేతను, "పెక్కు వేలమంది జనులోక్కపరి నాశమందిరి.


ఇదివఱకు సైన్యము మూఁడు భాగములనియు సందు తిరుమల రాయ రామరాయలకు విజయము సిద్దించెననియు !