పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదితొమ్మిదవ ప్రకరణము

289


జూచినంతనే యతని హృదయము నీరైపోయెను. అతఁడు యుద్ధమునకుం బోవగడంగెను.ఆ సుందరి విగ్రహ మతని ముందు నిలిచెను. అతని కాళ్ళు మఱి చలింప లేదు. అతఁడిఁక యుద్ధ భూమికి సడువ లేకపోయెను. పాపము ! ప్రతాపసింగు వెంటనే తగిన ఫలము నను భవించెను. అతని వర్తనము వేం కటాద్రికిం దెలిసెను. అతని హృదయము తీక్షకోపాగ్ని జ్వాలాదగ్ధంబై యుడుకుచుండెను. తోడనే నూర్గురు భటుల నంపి యాతని నున్నట్లు తీసికొనిరండని యజ్ఞా పించెను. వారు పోయి కర్తవ్యమును తెలియం జేసిరి. ఆతఁడు నిరాకరించినం బ్రయోజనము కలుగఁజాలదు. వారితోఁగూడి వేంకటాద్రి కడకుంబోయెను. అచ్చటఁగల యోధు లెల్లరును అతని వర్తనముం ద్వేషించిరి, దూషించిరి. వేంకటాద్రి యిట్లనెను.


“ ఛీ! నీచుఁడా ! స్వదేశాభిమానమును విడిచి శత్రు వగు గోల్కొండ నవాబు వారించినంత మాత్రమున యుద్ధము నకు రాకుండుట నీకుచిత మేనా ?


చిన్న ప్పటినుండియు నీకు సకల సంపదలను సర్వభోగ భాగ్యములను ఇచ్చి గొప్ప యుద్యోగమును గౌరవమును గల్గఁ జేసిన రామరాజు చక్రవర్తి యెడంగల భక్తి ! యెల్ల నేమిచేసి తివి ! గోల్కొండ నవాబు కూతును నీ కిప్పించిన దెవరు ? ఆ విశ్వాస మేని లోపల నుంచుకొన వలదా ? ఇట్టి విశ్వాసహీను నేమి చేయవలయునో నీవే చెప్పుము ? ”