పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది తొమ్మిదవ ప్రకరణ ము

స్వామి ద్రోహము

ఇట్లంతటను హిందువులకే విజయములు తటస్థించుటం జేసి వారికి గర్వము కొంచెము హెచ్చెను. పైన వారి కాయా సమును హెచ్చెను. శత్రువుల సైనికుల నెంత నఱికినను జీమల బారులవలె నింకను నచ్చుచుండిరి. విధివిరామము లేక యుండెను.


రాజ్యాంగ పాలనము మిక్కిలి కష్టమైనది. రాజులు తా మేర్పఱుచుకొను మంత్రులు సేనాపతులు మొదలగు వారిని మిక్కిలి యోజించి మఱి యుద్యోగములలోనికిం జేర్చుకొన వలయును. సామాన్య భటులలోఁ గొలదిపాటి వ్యత్యాసము లుండినను అంత కష్టముకలుగదు. కాని గొప్పయుద్యోగ ములు పౌరుషవంతులు జ్ఞానవంతులు స్వదేశాభిమానులు కాక యున్నచో దేశమున కెల్లను గొప్ప నష్టము సంభవించును. మంత్రులను సేనాపతులను నియించుటయందే రాజ్యము యొక్క మంచి చెడ్డలు శుభాశుభములు నిల్చియుండును. ప్రతాపసింగు పౌరుష వంతుఁడు ధర్యవంతుఁడే కాని విషయలంపటుఁడు. నూర్జహాను ముఖ సుధాకర మండలముం