పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియేడవ ప్రకరణము


ఆదిల్శాహా పరాభవము

వీరుల చరితములు భాషణములు మనలను పులకాం కితులం జేయును. వారి పరాక్రమమును గండ్లారఁజూచుట తట స్థించునేని మన మేమగుదుమో వర్ణింపఁజాలము. ఇపుడా యుద్ధమునం దేవరెవరిం దార్కొని యె బెట్టులు సమరమును జేయుచున్నారో చూతము.


ఆదిల్శాహా తిరుమల రాయల పక్షములు రెండు నొం డొంటిందాకినవి. కొంతవఱకు నిరుపక్షముల వారును సమాన ముగాఁ బోరిరి. ఆంధ్రవీరులు ప్రాణముల "కాశింపక శత్రువుల పయింబడి చేతికివచ్చిన ఫ్లెల్ల నఱకుచుండిరి. ఆ దెబ్బలకుం దాళజాలక కొంత సేపయిన తరువాతఁ దురుష్కు లెల్లరును జెలా చెదరై పోవుచుండిరి.


ఆదిల్శాహా అది చూచి సహింపనోపక వచ్చి తన సైని కులం బ్రోత్సాహముచేసి మరల శత్రువుల మీఁదికిఁ దోలు చుండెను. ఇరుపక్షముందును ప్రధాన వీర శిఖామణులు పెక్కుడు గతించిరి. భటులు పోకకు లెక్క లేదు. వందలు, వేలు, పది వేలు, గతించిరి.