పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియాఱవ ప్రకరణము

277


విధూతానేక మహాయోధ శిరస్సమూహులయిన యుత్తమయోధులచేఁ బ్రయోగింపఁబడిన నిశితశర పరంపర లును, ఖడ్గపరం పరలును, విశ్వవిఖ్యాత శౌర్యపరాక్రమ ధనులయిన సేనాపతులయు, యోధులయు శిరంబులను నిము సములోఁ ద్రుంచి వేయుచుండెను. కొంద అశ్వకులు బాకు లీట్లెలంగై కొని విజృంభించి రౌతులంబొడుచుచుండిరి. ఆ పడిన రౌతుల శిరమ్ములనుండియు, దేహమ్ములనుండియుఁ బ్రవ హించుచున్న రక్తముచేఁదడిసి తెల్లనియు త్తమాశ్వము లెల్ల సెర్రంబడుచుండెను. మహావీరుల లోచనములు రక్తకాంతి విభాసురములై భయంకరము లగుచుండెను. పేరువడిసిన వీరు లెల్లరు నొండొరులం దాకి కొనుచు నత్యుత్సాహమునం బోరాడుచుండిరి. భటుల శిరములు కెందామర పూబంతుల గతి బ్రకాశించుచు నేల పైనం బడుచుండెను.


శత్రుహృదయ విదారణాతి దక్ష దారుణ శతఘ్ని వ్రాత ప్రోద్భనా నూన భయంకర నిరోషములు దశదిశాంతరప్రదే శములు నిండి లోకమున కెల్లంజెవుడు కూర్చుచుండెను. ఒక్కొక ఫిరంగి బ్రద్దలై సమీపస్థానేక భట గజ హయాదుల జీవములం గొనుచుండెను !


తుపాకులోఁ దోటాలు పెట్టి కొందఱు ప్రయోగించు చుండిరి. కొందఱాయుధములంబారవైచి గ్రుద్దుకొనుచుండిరి. మఱికొందఱు తన్ను కొనుచుండిరి. ఇంక కొందఱు పొడుచు