పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజయనగర సామ్రాజ్యము


నొందెను. అందు భటుల తలలు, మొలలు, కాళ్ళు, చేతులు ముక్కులు, మూపులు, వీపులు, తేలుచుండెను.


ఆకసమున స్వేచ్ఛారూపముగల దేవతలు సిద్ధులు, గంధర్వులు తదితర దేవ యోని విశేషులును వచ్చి యాసమర ముం బక్షులరూపమునం దిలకించు చున్నారన్నట్లు కాకులు గ్రద్దలు రాబందులు మొదలగు పక్షి జాతులు నుండి సూర్య కిరణ ప్రసారమునకుంగూడ నభ్యంతరము కల్గించు నట్లుండెను.


భటులను భటులు, యోధులను యోధులు, పరా క్రమ వంతులను బరాక్రమవంతులు, శూరులను శూరులు, ధీరులను ధీరులు, సేనాపతులను సేనాపతులు, పిన్న వారిని, పిన్న వారు, పెద్దవారిని పెద్దవారు మార్కొనుచుండిరి. ప్రచ లత్ కృష్ణ, మహీధ్ర పంక్తుల నధ:కరించుచున్న మహా కరీంద్ర రాజముల ఘీంకృతులు మిన్ను ముట్టి, మన్నుంద దిక్కుల కెగఁబాకి యుద్ధభటులకు ఫుటములం - జల్లులుపోవు నట్లు చేసి పిఱికీ వారికి భయంబు నాపాదించుచుండెను. గండ శిలలవలె దుర్భేద్యములగు నా యేనుంగుల కుంభస్థలము లుత్తమ సేనానాయకులయు, యోధులయు, భటులయు భయంకర ములయిన ఇనుపగడలు దెబ్బలచేతను, మందు గుండు సామా నుల చేతను బగిలి నేల పైనం బడుచుండెను. ఎరిగి పడుచున్న పర్వత పంక్తులగతి యేనుంగులు వీనుంగులయి 'నేల పై సం బడుచుండెను.