పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియాఱవ ప్రకరణము

275


కడమ తురుష్క సైస్యములువచ్చి యీ వైపున రామ రాజుతో బోరుచుండగనే కృష్ణ కావల దిగువడియుండిన గోల్కొండ నవాబును, అతని సైన్యములును వచ్చి హిందు వులపైసం బడిరి.


హిందు పుల్యముల వలెనే ఆ నల్గురు సనాబుల పై స్యయులును మూడు భాగములుగా విభాగింపఁ బడెను. ఆది ల్శాహా తిరుమలరాయని,గోల్కొండ నవాబు 'వేంకటాద్రిని, అహమ్మద్ నగను బేదరు వవాబులు రామరాజును, ఎదు ర్కొనిరి.


పోరు ఘోరంబాయెను. సూర్యోదయమగు చుండెను. ఉభయ పక్షములయందు.. వీరుల హృదయములు పొంగి పొరలుచుండెను. " లు, తళతళలు, లోక మెల్ల నిండిపో యెను. కన్ను లప్పుడప్పుడే పొడి చూపుచున్న సూర్యుని కిరణ ములందు నిశుభ్రకాంతుతులచే బ్రకాశించుచుండెను. సేనా నాయకులు నడిపినట్లు , భటులు పర్విడుచు నొండొరులందాకు పరాక్రమముం జూపుకొనుచుండిరి. పూర్వ వైరముగల యోధులోండొరులందార్కొని పౌరుష సూచక వాక్యములు పల్కుము దిట్టు కొనుచు స్వేచ్ఛగా యుద్ధమునం బ్రవర్తించి తలను నరుకుకొను చుండిరి.


నిముసములోపలరక్తము కాల్వలుగట్టను. 'ఏఱు లై పారదొడగెను. నదులాయెను. మహాప్రవాహ రూపము