పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

274

విజయనగర సామ్రాజ్యము


శ్రీధరుఁడు తిరుమల రాయల సైన్యములను మేల్కొ లుపుచుండెను. రాధాకుమార విజయసింహప్రముఖ మహా యోధులు మేల్కాంచిరి,


ఆయుధా గారములం దెరచిరి. సేవకులు వేలకొలది పోయి యే యే శిబిరములలో నే యే భటుల కే యే యాయుధ ములు కావలయునో తెలిసికొని వారికవి యెల్లం దెచ్చియిచ్చు చుండిరి. ఎవరికిఁదోచిన చందాన వారు పాటుపడుచుండిరి. యోగియు శ్రీధరుఁడును ప్రవేశించి యింకను గడియకాలేదు. అప్పుడే తురుష్కులు రామరాజు సైన్యమును సమీపించిరి. వారి 'సైన్యములలో దీపముల సన్నిఁటిని ఆర్పి వేసిరి, అందుచే వారు దృష్టి కింగోచరించుట లేదు. కాని పుడమి యీనినట్లు లక్షలకొలంది భటులు ఏంగులు గుర్రములు వచ్చి పడుచుండెను.


ముందు వచ్చి యెంత మేల్కొలిపినను విశేషకాలము వ్యవధి లేనందున సర్వసైన్యములును మేలుకొనుటకు వీలు గలుగ లేదు. నిద్రావస్థలో నున్న కొండఱను దురుష్కులు శిబిర ములలోఁ బ్రవేశించి నఱకుచుండిరి.


రామ రాజు, వేంకటాద్రి తిరుమల రాయలు, విజయసిం హుఁడు, రాథా కుమారుఁడు మొదలగు వారెల్ల, సైన్యము లం బురికొల్పి యుద్ధమునకు సన్నద్ధము చేయుచుండిరి.