పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ము ప్ప దియారవ ప్రకరణము

యుదము

ఒక డట్లు రామరాజు క్రిందనున్న సైన్యములలో బ్రవేశించి యెల్లరను మేల్కొలుపుచుండెను. శత్రువులువచ్చు చున్నారను కేకలు నల్గిక్కులయందును బ్రతిధ్వనించు చుం డెను. రక్షక భటవర్గములు నాల్గుమూలలకును పరువు లెత్తి తమకుఁదోఁచిన చందానం గేకలు వైచుచు నెల్ల సైనికులను యుద్ధమునకుం బురికొల్పుచుండిరి.


గొందఱు కండ్లు నులుముకొనుచు లేచుచుండిరి. మఱి కొందఱుల్కి పడుచుంది. కొందఱు నిద్రనుండి లేవ లేక లేప వచ్చిన వారిం దిట్టుచుండిరి. తురుష్కులు వచ్చుచున్నారన్న మాటలు చెవింబడఁగనే పండ్లు పటపటమని పించుచు కొందఱు ఖడ్గముల కేగుచుండిరి. “ ఏరిరా! తురుష్కులెక్కడ ? ” కొందఱు కేకలు వైచుచు బరువెతు చుండిరి. కొందఱు లేచి తమయస్రములను సిద్ధము చేసికొనుచుండిరి. రణదుందుభులు భూమ్యాకాశ మధ్య ప్రదేశమునంతను వ్యాపించుచుండెను. కొందఱొండొరులం ప్రోత్సహించు కొనుచు, యుద్ధసన్నద్ధులగు చుండిరి.