పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

270

విజయనగర సామ్రాజ్యము


.

మన మనుకొందుము. వారి యాతురతను నాతీతము. వారు గుఱ్ఱములం బరువెత్తించుచు విజయనగర సైన్య శిబిరములకు మిక్కిలి సమీపమునకు వచ్చిరి. వారి కప్పుడు దీపములకాంతి కనంబడుచుండెను.


వారా దీపముల వెలుతురున నటునిటుంబరికించిరి. సమీపములో మానవు లెవ్వరును వారికిం గానరాలేదు. వారు వారి యాతురత అంతకంత కతిశయించుచుండెను. వారిట్లు, భాషింపఁదొడంగిరి.


శ్రీధరా! చూచితివా విజయగనర సామ్రాజ్యమున కెంతలో నెంతటి విపత్యలు వచ్చుచున్నవో! ఆహా ! దైవ మా!నీచేతలు విచిత్రములు. రాజ్యముల నిముసములోఁ గూలం ద్రోతువు '


“అవును, సజ్జనులయిన వారి మంత్రముంగొనక దుర్జను లయు ద్రోహులయు, పాపులయు, తంత్రములంగొని రాజ్య మేలు వారి కాపదలు రాకయుండునా ? '


“అయినను, అందులకు వారిం దూషించి ప్రయోజనము లేదు. తమనోట తాము మన్నుం గొట్టుకొనవలయునని యె వరు నెన్నఁడును దలంపరు కాని వినాశకాలము సంప్రాప్త మగు నప్పటి కిట్టి బుద్ధిని దైవము కల్గించును ” "

చూచితివా చక్రధరుఁడునేఁడేమి చేసినాడో, శత్రు రాజుల పోకను రామరాజెఱింగియు, ఏకాలమున నేమివచ్చు .