పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజయనగర సామ్రాజ్యము శ్రీధ:-తమ్ములుగూడ నింతవి వేకశూన్యులై నారా?

బుద్ధి:-ఆ తమ్ము లాయన్న మాటలకు నడుగుదాటరు. 'అతఁడు క్రమక్రమముగా నన్ను గూడఁ గల్పుకొనవలయునని సంక ల్పించుకొనినాఁడు. కాని నేనందులకు లోబడువాఁడను గా ననియెఱిఁగి, భేదోపాయముచే నాకును రాజునకును విరో ధముఁ గల్పించి, రాజ్య విషయములందు రామ రాజక్షమా తలనాధునకు నా మంత్ర మనవసరముగాఁ జేయఁ జూచు చున్నాఁడు. .

శ్రీధ :-ఓరీ ! తుచ్ఛుఁడా ! నీవలె ధనమున కాశపడి బుద్ధిసాగ రుఁడు విపకులం జేరుననుకొంటివా ? అగుఁగాక ! మీ పాప మునకుఁదగిన ఫలము నందుదురుగాక !

బుద్ధి: పాపమున కేవృద్ధి. వారి కే విజయ మగునట్లున్నది.

శ్రీధ:-ఏమి ! ఇందువారు నెగ్గుటరిది. తండ్రి తాతల నాటనుండి మివారు మంత్రిత్వమున విఖ్యాతిఁ గాంచుచు రాజ్య సంర క్షణ మాచరించినారు. అట్టివంశమున జన్మించి యేకపట మును లేక చరించుచున్న నీయెడ రాజునకుఁ గ్రోధము గల్గింపఁగలరా ! అదియునుంగాక నీయందుఁ బూర్వము నుండియు రాజునకు మక్కువగలదు.

బుద్ధి:-అది నశించుచున్నది. నాయందు రాజునకుఁ బూర్వ గౌరవము లేదు. లేకపోవుఁగాక. నామంత్రిత్వము పోవుఁ