పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియైదవ ప్రకరణము


మునుండి వారికి పాపము రాత్రులయందు నిద్దుర లేదు ! నేడు కుంభకర్ణులవలెఁ బ్రపంచ మెఱుఁగక హాయిగా నిద్రంపవచ్చు నని సంతసించిరి. అర్థ రాత్రము సమీపించెను. రామరాజు సైనికు లెల్లరు హాయిగా నిద్రించిరి. యోధులు నిద్రించిరి. సేనాధిపతులు నిద్రించిరి. వేంకటాద్రి తిరుమల రాయాదులు నిద్రించిరి. ఆ నిద్ర పట్టి నిద్ర కాదు. గాఢ నిద్ర. గుండియల పై నంజేతులనుంచుకొని మైమఱచి నిద్రించు నమూల్యమైన నీద్ర.


విజయనగర సామ్రాజ్య సైన్యశిబిరములలోపలను వెలు పలను, ముందు బజారులందును, ఆవశ్యకములైన సర్వస్థలంబు లందును దీపములు వెలుంగుచుండెను. ఆ సర్వ సైన్యముల చుట్టును, మధ్యను "సెక్కువందలమంది రక్షక భటులు మాత్రము. నిద్రింపక కావలికాయుచుండిరి. కొందఱు రక్షక భటులు శిబిర శ్రేణుల మధ్యమున నున్న వీధుల వెంట నిశ్శబ్దముగా సంచ నెచ్చట నేమి జఱుగుచున్న దియుఁ జూచుచుండిరి.


అట్టి భయుకరము నిశాసమయమున నిరువురు మానవులు విజయనగర సైన్య శిబిరముల కభిముఖులై నవా బుల - సైన్యముల = వైపునుండి యత్యంత వేగముతో గుఱ్ఱము లను బరుగైత్తించుచు వచ్చుచుండిరి


వారి గుండెలు దడదడఁ గొట్టుకొనుచుండెను. ఆదడ దడను వీక్షించితి మేని వారి గుండెలు నిజముగాఁ బగులునని.