పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

268

విజయనగర సామ్రాజ్యము


బోవుచుండిరి. అధికార్లు తమతమ పనులను జాగ్రత్తతో నిర్వర్తించుచుఁ దమయధికారములలో నున్న వారిని వారి స్థానములం దప్పి పోకుండఁ జేయుచుండిరి. భటు లెల్లరు జాగ రూకులై ప్రమస్తత నందక తమతను మార్గములలో మెల్లగా నడచుచుండిరి.

అర్థ రాత్రమాయెను. ప్రపంచమెల్ల నంధకారబంధురమై యుండెను. కాఱు చీకట్లు సర్వత్ర న్యాపించి దృష్టిని చొర నీయకుండెను. నాల్గుదిక్కుల యందెచ్చటను మానవ సంచా రము కాననచ్చుట లేదు. సమీపస్థ కృష్ణాతరంగిణీ మద్యస్థతము లై మండూకతండంబులు బెక బెక మని యత్యంత కఠోర ములగు ద్వీద్వనుల నాచరించు చుండెను. అధ్వనులు మాత్ర ము దిగంతములయందుఁ బ్రతిధ్వనించుచుండెను. ఆస్రవంతికిం బ్రాంతము లందున్న పచ్చిక బయళ్ళలో ఉన్న చిన్న కీటక ములు కీచు కీచుమని ధ్వనించుచుండెను. ఆ రాత్రి భయం కరమైయుండెను. అచ్చటచ్చట నాతరంగిణికి సమీసములం దున్న యడవులలో గ్రూరమృగములు తమకు యుక్త ములైన తెఱంగుల నినాదములు సల్పుచుండెను.


శత్రుపతుము వారు బయలు దేఱి పోవుదురను వార్త రామరాజునకును దత్సర్వ సైనికులకును, ఇతరులకును దెలి సెను. వారు బయలు దేతి పోవుటను లెస్సగాఁ బ్రయత్నించి చూచిరి. విశ్రాంతి కలుగునని తలంచిరి. చాల కాల