పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది యై ద వ ప్రకరణ ము

నిద్ర

మరునాఁడుదయమున గోల్కొండనవాబు పోవు నపుడు తాను వెళ్ళి యితర నవాబులనంపి వైచి దిరిగి విజయ | నగరమునకు వచ్చెదనని చెప్పిపోయెను. రామరాజ వేంక టాద్రి తిరుమలవ్రాయలును చక్రధరుఁడును వల్లెయని యతని నట్లు చేయుటకుఁ బురికొల్పుచుఁ దమ యానందముం దెలిపిరి.


కుతుబ్ శాహా యట్లు తన యుద్ధ శిబిరములకుం బోయి కడమ బీజపూరు, బేదరు, అహమ్మద్ నగరు నవాబులంబిల్పించి కర్తవ్య మాలోచింపఁదొడంగెను. గోల్కొండ వారి సేనలు కొన్ని దక్కఁదక్కినవన్నియు నారాత్రి యచ్చటినుండి పోవుట కేర్పాటు చేయంబడియెను. యుద్ధమును మాని నవాబుల సైన్యములన్నియు స్వదేశమునకుం బోవుచుస్నట్లు వార్తలను వ్యాపింపఁ జేసిరి. నాఁడుడయము మధ్యాహ్నము కొన్ని శిబిర ములను పెఱికి వేసిరి. భటు లందఱు సాయంత్రమువఱకు సన్నా హములను జేయుచుండిరి.


రామరాజు పక్షము వారు నాఁడు గాక మఱున్నాడు సాయంత్రము తిరిగి విజయనగరమునకుంబోవ నిశ్చయించు