పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదినాల్గవ ప్రకరణము

265


సాయంత్రమాయెను. మార్జను నూర్జహానుగా నెల్ల రును భావించిరి. ఏనుగులతో గుఱ్ఱములతోను, తగిన భూష ణములతోను వైభవముగాను, ఆడంబరముగాను గోల్కొండ నవాబు కృష్ణా తీరముననున్న యా రామరాజు యుద్ధశిబిర ములలోఁ బ్రవేశించెను. అతనికిం దగిన గౌరనము లెల్లె జరుపఁ బడెను. రామరాజు, మంత్రులు, సేనాపతులు, ఇతరులు, , అతనిం దగినవిధాన గౌరవించిరి. మహా పైభవముతో నా రాత్రి యా పెండ్లి కావింపఁబడెను. కాని యా జఱుగుచున్న పెండ్లి తన కుమార్తె” దేయని సవాబు లేశ మేని యెఱుఁగడు. తన మోసము ఫలించినదని యతఁడు సంతసించుచుండెను.


హిందువులు తురుష్క నాధుని సుతను ప్రతాపసింగు పెండ్లాడం గల్గి నందులకు సంతోషించు చుండిరి. అ యిరువురును స్ఫురద్రూపముకలవారు. లోకములోఁ జాలమంది యా సంబంధము తగిన దేయని మెచ్చిరి.


నూర్జహాను తన కోరిక యీ డేరినందుల కపరిమి తా నంద భరితు రాలాయెను. ప్రతాపసింగు హృదయము కూడఁ బరిపూర్ణానంద సముద్రమునం దేలి యాడుచుండెను. మోహమునకును బ్రేమకును భేదము చాలఁగలదు. మోహము వేఱు. ప్రేమ వేఱు. అది యిది కాదు. ఇది అది కాదు. A