పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

264

విజయనగర సామ్రాజ్యము


అవి యన్నియుఁ జెల్లించుట కిష్టపడనివారిం బైబడికొట్టునాయేమి?


ఇరుపక్షములవారును గోల్కొండ నవాబు నిజముగాఁ గూతును బ్రతాపసింగునకిచ్చి పెండ్లి చేయునని నమ్మిరి. ఇంతలో నూర్జహానొక తంత్రముఁ బన్నెను. ఆమె తన సేవకురాలిని వెంట బెట్టుకొని యితరు లెఱుఁగకుండ మార్జయు నామె తల్లియు నున్న శిబిరమునకరిగి వారికిం దనయుద్దేశమును నెల్లడించెను. మఱియుం బెక్కు వేలు చేయు నాభరణంబుల నొసంగెను. ప్రతాపసింగునకుఁ దమతంత్రము తెలిసిన యెడల తమ్మేమి చేయునోయని వారిరువురు భయపడుచుండిరి.


ఆ యాభరణములంజూచి సంతసించిరి. అంతకంటెఁ దమ విముక్తికి మఱి హెచ్చుగా సంతసించిరి. మార్జ వేషమును రాజసుత యలంకరించెను. 'రాజసుత వేషమును మార్జి యలంకరించు కొనెను. నిజముగా నా యిరువురు మొగముల లోను, దేహముల లోను, తీరుల లోను, భేదము "లేశమును లేదు. ఉన్నను నిత్యపరిచయము గలవారుకూడఁ గని పెట్టఁజూ"లరు. అచ్చటినుండి మార్జ్ నవాబు కూతురు వేషముతో" నామందిర మును జొచ్చెను. నూర్జహాను మాట్లె వేషముతో నచ్చటనే యుండెను. నూర్జహాను ప్రతాపసింగుసకడకుం బోయిన వెన్క మార్జయు నాపె తల్లియు నడిరాత్రివేళ పారిపోవు నేర్పాటులు చేసికొనిరి.