పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది నాల్గవ ప్రకరణము


వివాహము

మార్టను గోల్కొండ నవాబు కూతురని మోసము చేసి మఱునాఁ డంపుటకు నిశ్చయింపఁ బడెను. ఆ కుట్ర యెవరికిని దెలియదు. నూర్జహాను మాత్రము దానిం దెలిసి కొనెను. మార్జ తల్లియు, మార్జయు, ఆదిల్శాహాయు సందులకంగీకరించిరి.


సంధి నుభయపక్షములవారు నంగీకరించిరి. యుద్ధము లు మాని వేసి ఇరుపక్షములవారును శాంతితోను, స్నేహము తోను, ఉందురని యెల్లరును నమ్మిరి.. నేఁడు నూర్జహానును దమ సైన్యాధిపతియగు ప్రతాపసింగున కిచ్చి పెండ్లి చేయుదురని హిందూభటులెల్లరు నానందమున మునిగియుండిరి. రాజులు, సేనాధిపతులు, యోధులు, భటులు, అందఱును సాయంత్ర మా పెండిలిం జూడ సిద్ధ పడుచుండిరి. గోల్కొండ నవాబు యును మార్జనంపుట కామెను సర్వాలంకారభూషితు రాలిం జేయించెను. సంధిపత్రముల పైన నవాబు లెల్లరును దస్కతులు చేసిరి. మనుష్యులు నీతికి ధర్మమునకును లోఁబడవలయును. కాని కాగితము లేమిచేయఁ గలవు? ఇష్టము లేని షరతుల నెన్ని యేని వ్రాసి యొడంబడికలు పెక్కులు సృష్టింప వచ్చును.