పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదిమూఁడవ ప్రకరణము


బయలు దేఱి కొంతదూరము పోవునప్పటికి నిర్జనమైన బయ లొకటి తగిలెను.

వారు నల్దిక్కులకును దృష్టిని సారించిపరీక్షించి చూచిరి. ఎవరును గన్పడ లేదు. ఆ బయలులో స్వారి చేయుచు మెల్లగా నిట్లు భాషించిరి.


" మీరాలోచించిన తంత్రమేది ? ”

" ఏమియును లేదు. మీ కుమార్తె నూర్జహానువంటి బాలిక యొక్కర్తు విజాపూరులో నవాబు సేవయందున్నది. ఆమెను పూర్వము నే నొకసారి చూచియుంటిని.ఆమెను జూచిన మన నూర్జహానునుజూడ నక్కఱ లేదు. ఇరువురును, ఒక్క తీరుగనే యుందురు. చిరపరిచయము గలవారు తప్ప నేవ రును వీరిరువురకు భేదమును గంగొనం జాలరు. '


“అట్లయినచో నా పై మనకుఁ జాలనుపకృతి చేయఁ గలదు. ఎంత ధనమును ఖర్చు చేసినను ఆపె లభించినంజాలును' “మొన్న నే ఆపెకొఱకును ఆపెతల్లి కొఱుకును గొందఱి సేవకుల నంపితిని. వారు పోయి యామెను దీసికొనివచ్చినారు. ఆమె యిపుడు నాశిబిరమున నున్నది. సరిగా మన నూర్జహాను వలెనే యుండును. ఆమెనే నూర్జహానని ప్రతాపసింగునకుం బంపుదము. తరువాతఁ గాఁగల కార్యమును విచారింపవచ్చును.”

ఆమె యిందు కొడంబడునా? "

ఆమె సద్గుణవతి. స్వదేశాభిమానురాలు. ఈ కా ర్యము నత్యంత భక్తితోఁ జేసెదననియున్నది.”