పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

260

విజయనగర సామ్రాజ్యము


రాజ్యములు దక్కవు. అన్నియును ఆంధ్రుల పాలు కావలసి వచ్చును. ఈయొక్క కారణముచే నిన్ని పాట్లు సంభవింప నున్నవి. కర్తవ్య మేమియుఁ దోఁపకున్నది. ఏమిచేయుదును.?

నావలన నిందఱ కిన్ని పాట్లు గల్గుటయేగాక తురుష్క ప్రపంచములో నాకుంగల్గు నిందలు చెప్పశక్యముగాదు. పెక్కు వత్సరముల నుండి స్థిరముగానున్న మహమ్మదీయ రాష్ట్రము లను నాల్గింటినొక్కసారిగా నా చేతితో నాశముచేయనా! చేసి నచో నల్గురు తురకలున్న చోటఁ దలయెత్తుటకు నాకు వీల గునా ! ఎత్తఁగల్గుదునా?


అంతలో నతనిమంత్రి యచటికిన చ్చెను. నవాబతనిం జూచి “ కూర్చుండుఁడు ” అనెను. “కూర్చుండెదను కాని తమరేదో యోజించుచున్న ట్లున్నారు. ఏమది? మిముఖ మంత విచారవంతమయి యున్న దేమి ?"


“ లేదు. నేను సంధివిషయమునే విచారించుచున్నాను. ఇప్పటివఱకు నా కేమియుందోఁచినది కాదు. అంతకంటే మఱే మియు లేదు. మీరేమి ఆలోచించినారు ?” “దీని కింతగా విచారింపవలయునా ! నేనొక క్రొత్త పద్ధతించొక్కందలంచితిని. రండు, మీకంతయు నివేదించెదను.”

మంత్రి శిబిర మచ్చటికిం గొంచెము దూరమునగలదు. ఆ ప్రదేశమ్మై నిశ్శబ్దముగా నుండును. వారా శిబిరములనుండి