పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదిమూఁడవ ప్రకరణము

259


కార్యము నాచరించుట కేల జంకనలయును ? నేఁడు తురుష్క- యువతులు హిందువులను, హిందూయునతులు తురుష్కులను బెండ్లి యాడుచుండుట లేదా ఛీ! అదియుక్తము కాదు. హిందువు లు కాఫరులు. మతాంతరులై విగ్రహారాధన తత్పరులగు పాపు లతో సంబంధ బాంధవ్యములు చేయనగునా ! అయినచో నీ విధివర కేల పెక్కండ్రు హిందూయునతులతో విహరించితివి? ఇప్పుడు జగన్మోహినికై ప్రాణములనుగూడ విడున నేల సంసిద్ధ మగుచుంటివి? కాదు కాదు. అది వేఱు. దైవసాక్షిగా ధర్మపత్ని గా నొకరితెను వరించుటయందును, వివాహమాడక యుప పత్నులనుగాఁ జేసికొనుటయందును భేదము చాల కలదు. అయినను ఆ విషయ ముండనిమ్ము.


నేటితో వ్యనధిమూఁడు దినములు నైపోయినవి. రేపు యుద్ధము ప్రారంభముగా నున్నది. ఇడివఱకు విజయనగరము వారితోనెన్ని యుద్ధములు చేసినను, ఒక్క దానియందుఁగూడ మాకు విజయము లభించినది కాదు. ఒక్క హిందువునకు సల్లు వైదుగురు తురుష్కులున్నను గెలున లేక పోయితిమి. అట్టచో నిప్పుడు మా సైన్యము రామరాజు సైన్యమునకు రెట్టింపు మాత్ర మేకలదు. ఇఁక మాకు విజయసిద్ధి యెట్లు చేకూరునో "తెలియ కున్నది. పాపము! : నావాబు లెల్లరు సన్నును ,ఆదిల్శాహాను సమ్మి యుద్ధ భూమికి వచ్చినారు. మాపక్షమే యోడినచో వారికంఠ ములకు నమ్మించి యురిపోసినట్లుండును. అంతేకాదు, మాకు