పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

258

విజయనగర సామ్రాజ్యము


వులు పొరఁబడరని వారెఱుంగుదురు. రెండుదినములు గడచె ను. మూఁడవదినము సాయంతన మాయెను. గోల్కొండ నవాబున కేమియుం దోఁచలేదు. తదితర తురుష్క ప్రభువుల చిత్తము. లెట్లున్నను గోల్కొండ నవాబు చిత్తము నూర్జహా నును ప్రతాపసింగునకు నీయ నంగీకరింపలేదు. వారయినను ఇట్లుచేయుట యుక్తమని పైకిఁ జెప్ప లేదు. మఱుచటిదినము గోల్కొండ నవాబు తన హృదయమును వ్యక్తము చేయక తప్పదు. ఎట్లేని యితర నవాబులు సంధికి రాయ బారమును నడుపుటే యుక్తమని తలంచుచుండిరి. అతనికిని లోన నట్లే యుండెను. అందు చేతనే అతని మనస్సేమి చేయుటకును దెగ కుండెను.


అతఁడొంటరిగాఁ గూర్చుండి యుండెను.అతఁడేమేమో యోజించుకొనుచుండెను. చీకటిపడెను. అచ్చటఁగాని యాప్రాంతమునంగాని యెవరును లేదు. అతనికి పుడు నూర్జ హాను ప్రతాపసింగుని ప్రేమించి కృషించుచున్న వార్తకూడఁ దెలి సెను. అతఁడిట్లు యోచింపసాగెను.


'ఈసందిగ్ధ సమయము దుర్భరముగా నున్నది. ప్రతాప సింగుత్తమవంశీకుఁడు, సుందరుఁడు. అదియునుం గాక కుమారిత నూర్జహా నతనియందు బద్ధాను రాగ యైయున్నది. సమయ ' మో సంకటమయమై విషమముగా నున్నది. అతనికి నూర్జ హానునిచ్చి పెండ్లి చేయనా! చేసిన నేమి తప్పిదము ! తప్పులేని