పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదిమూఁడవ ప్రకరణము

257


యును. మాకు రమారమి యిప్పటికిఁ బదికోట్లయినది. అయి నను సంధియం దుభయపక్షముల సేమమును యోజించుట రాజధర్మము గావున నట్లు చేసితిమి/


(ii) మీరిచ్చేదమన్న దుర్గములును, దేశమును, ఇది వఱకు మా స్వాధీనములోనున్నవే కావున భూమిని హెచ్చింప వలయును. గోవా, తలికోట, బీజపూరు, కోవిలకొండ రాజు కొండలు తరపు సరిహద్దుగాఁగల్గి పడమటి సముద్రము పడ మటియెల్లగాను, గోదావరి తూర్పు బెల్ల గాను గలప్రదేశము నంతయు మాకు నీయవలయును.


(iii) పై మార్పులు రెండునుగాక యొక క్రొత్తషరతును మేము కోరుచున్నాము. మీలో గోల్కొండ నవాబు కుమార్తె నూర్జహానును మాప్రతాప సింగున కిచ్చి " పెండ్లిచేయ వలయును. తక్కినదెల్ల మాకంగీకారమే.” ఇందులకుం బ్రత్యుత్తరమిచ్చుటకు మూఁడుదినములు వ్యవధి నొసంగిరి. ఎట్లయినను రామరాజు పక్షమును సంధి నెపమున మోసగింపనెంచిన నవాబులు పై రెండు మార్పులకు నంగీకరించిరి. కాని మూఁడవ షరతునకు వారి కింకను గర్త వ్యము స్ఫురింపలేదు. ఆ యొక్క షరతువలన వారు తలంచిన దెల్ల వ్యర్థమగునట్లు కనంబడు చుండెను. ఆషరతున కంగీకరింప కున్న యెడల యుద్ధము సిద్ధము. ఇది వారు చేయఁదలఁచు కొన్న మోసమునకు విఘాతముఁ జేయును. కేవలమిస్థితిలో హిందు 17