పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

250

విజయనగర సామ్రాజ్యము

' అగిం వృధా నిన్నాయాస పెట్టి దు:ఖ పెట్టుట నాకిష్టము లేదు. కాదు కూడదు గట్టగాఁ జెప్పుమన్న చోఁ జెప్పెదను ” "నీకు సం దేహింపఁ బని లేదు. వచింపుము. చెలికత్తె లకు సుఖదుఃఖములలోఁ బాలు వహింపకున్కి ధర్మము కాదు. నా యోపినంత సాయము నీకుఁ జేసెదను. నావలనంగాక యున్న చోఁ బదంపడి విచారింతము ”


కొంచెము సేపువఱకు నూర్జహాను మాట్లాడలేదు. ఆమె యేదియో యోజించుచుండెను. ఆమె ముఖమున మంద హాస మస్ఫుటముగా నంకురించెను. అది విచార పరీవృతమై మంటిచేఁ గప్పఁబడిన మణివలె ప్రకాశించుచుండెను. ఎట్ట కేల కా ముఖమునుండి ముత్యములు రాలఁజొచ్చెను.


"ఈ రిత్తకోరిక నెల్వరింపఁ దగినది కాదు. అయినను నీతోడ నెన్ని యోసార్లు చెప్పవలెనని తలఁచియు మరల నిష్ప్ర యోజనమని భావించి యూరకుంటిని. ఇపుడు నీవంటి చెలి కత్తె యడుగఁగా దాఁచుట తగదు. నాఁడు మనమిరువురము గోల్కొండలో సరోవర స్నానము చేసి బహిస్సౌధోపరిభాగ ముననుండి యిటునటు తిరుగుచుంటిమి. జ్ఞప్తియున్నదా ?”

“ ఆ ! ఉన్నది. లేకేమి ? నాఁడు తోడి యాడువారితో జక్కఁగా నాడితిమి "

“ అవును చెలీ ! ఆనాఁటి సాయంకాలము-' ఊరకుండెను.

“ ఏమి జరిగినది?'