పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజయనగర సామ్రాజ్యము


వేంక:-అవును. నూతన సంస్కరణలుచేసి హిందూ సామ్రాజ్య మును భిన్న భిన్నములయి శకలములుగా కుండ బంధించి యుంచవలసిన కాలము వచ్చినది. హిందువులు మహమ్మ దీయులు పరస్పర విరోధముతో నున్నంతకాలము మన మెన్ని విధములం జింతించినను భరతఖండమున కవిచ్ఛిన్న మగు నేకజాతీయ భావ ముత్పన్నము కాఁజాలదు.


రామ: హిందువులయు మహమదీయులయుఁ బరస్పర వైషమ్య ముల మూలముననే హిందూ దేశము దోపిడులకును, రక్త పాతములకును మూలమగుచున్నది. స్వభావ సిద్ధముగా హిందువులకుఁ బరమత ద్వేషమును, వారిని హింసింపఁ జూచుటయు లేకున్నను మహమ్మదీయులంజూచి వీరుకూడ "నేర్చుకొనుచున్నారు. గత యుద్ధములలో మన సైనికు లధిపతుల యుపేక్షు చేతఁ గొన్ని యకార్యములను మహమ్మ దీయులకుం గావించియున్నారు. అట్టివానిని నిరోధించుట మనకుం గర్తవ్యము.


ఆ యీ యంశము లన్నియు రేపు సభలోఁ జర్చించి మన సేనానాయకులయుఁ దదితర లోకము యొక్కయు నను మతిం గైకొందము.