పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియొకటవ ప్రకరణము

245


వేంక: బహుశః వారిఁది మనకు దానము చేయుచున్నట్లు భావించుచువ్నారు గాఁబోలు.

చక్ర:-అప్లియున్నది.

రామ:-బీజపూరు గోల్కొండలనుండి చీల్చి గోవా, తలికోట, బీజపూరు, కోవిలకొండ, రాజుకొండ, కమ్మం మెట్టులవఱకు నున్న ఖండమును గోరిన సరిగా నుండును.

చక్ర:-అవును.

తిరుమ: మఱియొక అంశము జ్నప్తికి వచ్చినది. గోల్కొండ సనాబు కూతురు నూర్జహాను, మన ప్రధాన సైన్యాధి కారులలో నొకఁడయిన ప్రతాపసింగుని మోహించినది. ఆపెను మఱియొక తురుష్క యావనునికీయుట తండ్రి యుద్యోగించు చున్నాఁడట. ఆ మె నితనికిచ్చుటకును ఆమె కోరికను భంగము చేయకుండుటకును మనము కోర వలసియున్నది.

చక్ర:-అగునతఁడు విశ్వాసపాత్రుఁడగు వాఁడు. దేశహితై కాభి లాషి.అట్టివాని కీసాయమును చేయవలసినదే. మఱి యదియునుంగాక తురుష్కుల కన్నియలను మనవారు మ్లేచ్ఛులనియు నంటినం బాపము వచ్చుననియుఁ దలంచి ఢిల్లీ పాదుషా లెందఱు తమకన్న కూతుండ్ర నీ నుద్య మించినను, అంగీకరించిన వారు కారు. మనమిప్పుడే నూ తన మార్గమును ద్రొక్కవలయును.