పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

244

విజయనగర సామ్రాజ్యము


వ్యర్ధ మైనప్పుడుగాని దండోపాయము నుప యోగింపంజనదు. ఒక వేళ జయమే సిద్ధించు ననుకొనుఁడు. అప్పుడు మాత్రము మనకు లాభము కల్గునని యా మితలంపు? ఎందఱు సుందరీ మణులు విధవలై పోవుదురు ? ఎందఱు మహాయోధులు నశిం తురు ? ఎన్ని మోమములు సంభవించును. ఎన్ని యూఱులకుఁ గష్టనష్టములు కల్గును. కావున నెన్ని విధములం జూచినను యుద్ధములకుం బోవుట మనకుఁ గార్యము కాదు' ఆ యిరువురును మఱి మాట్లాడలేదు. కొంత సేపూర కుండిరి.


రామ:- అవును. అయిదుకోట్ల రూపాయిల నైనను కోర కున్న చో మనయుద్ధపు ఖర్చులు బొత్తుగాఁ జాలవు. ఇంక దేశము మాట పేరేగాని 'వారు మనకిచ్చినదే లేదు. అది యం తయు నిదివఱకు మనచే జయింపఁబడినదే. జయింపఁబడిన రాజ్యమునే మరల మనకు నిత్తురంట!


చక్రధ:-ఇందు రాచూరు పానగల్లు మొదలగు మన పూర్వ దుర్గములు మాత్రమే చేరియున్నవి. ఇవి యిదివఱకే మనక్రిందనున్నవి. వీరిత్తు మస్న ప్రదేశమునకంతటికిని గలిసి వత్సరమునకు నాల్గు లక్షల రూపాయ లేని శిస్తు రాదు. అందు మూఁడువంతులు మనపూర్వపు ప్రదేశముల మీఁ డనే వచ్చును. ఇఁక నొక లక్ష రూపాయాలువచ్చు. దానినా వారిచ్చునది ?