పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియొకటవ ప్రకరణము

243


. క్షించుచున్న మన సై నికులకుందగిన సమయంబు చిక్కినది. ఇట్టి సమయంబును వృథా పోనిచ్చుట మంచిది కాదు. సామాజ్య రక్షణకై సర్వస్వమును, ఈయ సిద్ధముగా నున్న మన వీరుల పరాక్రమ సంపదనొకసరి రుచిచూ చినంగాని తురుష్కకుల సాంసనులు భయంపడి మనను గన్నెత్తి చూచుట కేని వెఱవరు.


చక్రధరునకుఁ దిరుమల రాయ వేంకటాద్రుల స్వభావ ములు తెలియును. ప్రస్తుతము సంధితంత్రము సరిగా నడవ కున్న చో అతనికిం గష్టము. విజయనగర సామ్రాజ్య సై న్య ములను మోసపుచ్చుట కంతగా వీలుండదు. అందుచేతఁ దిరు మల రాయ వేంకటాద్రివీరుల వచనము లతనికిం గార్ణలఠోరము లై యుండెను. అతని ముఖ మిపుడు రామరాజ చక్రవర్తివంక ఁ జూచు చుండెను. అతఁడిట్ల నెను.

“ సోదరులారా ! సామ్రాజ్య కార్య నిర్వహణ భారము ను మీరువహించి యుండక పోవుటచే నట్లనుచున్నారు గాని యుద్ధము మాటలతో నగు కార్యము కాదు. మీరు మహా యోధులగుటచే మీకది రుచించును. కాని యుద్ధమున జయము మన కేయగునో వారి కేయగునో మనము చెప్పజాలము. ఒక వేళ జయము మన కేయైనను మనము చెందునష్ట మింతని వచింపఁగలమా ? సంధియందన్న నో ఆభయము లేదుగదా ! రాజ కార్య నిర్వహణ చతురునకు సామ దాన భేదములు గర్ణకఠోరము