పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

242

విజయనగర సామ్రాజ్యము


ఇంద్రజిత్తుగతించినను, విభీషణుఁడు శత్రుపక్షము నవలంబిం చినను, లవ మేని చలనము కల్గినది కాదు. ఇట్టిగుణమే హిందూ దేశమునందలి పెక్కు సామ్రాజ్యములను, రాజ్యములను నాశ ముచేసినది. ఆత్మశక్తి విశ్వాసపరులకు గర్వము, నిర్లక్ష్యభా వము సహజగుణములు. అవియే వారికి విషముగాఁ బరిణ మించుచుండును. కానీ, కాలమా సన్న మగునందాఁక వారు దానింగ్రహింపఁ జాలరు. ఆ విశ్వాసమే గర్వవిరహితమై దూర దృష్టి సమేత మైనప్పుడు ఫలప్రదమగును. అది మనుజులకు సర్వ సిద్ధినొసంగును.


చక్ర:-ప్రకృతము షరతులలో ధనమిచ్చుట మిక్కిలి తక్కువ గా నున్నది. మనకింతవఱకైన యుద్ధవ్యయ మాఱుకోట్ల డెబ్బదియయిదు లక్షలు. పోనిమ్ము, రాజ్య మేని కొంత యిత్తురన్న నది చాలకొంచేము. ఆ యిచ్చు ప్రదేశమంత యు నొకకోటి రూపాయలైనను జేయదు.

తిరు:-సంధియేల ? 'పైన మాయిష్టము కాని నాకు సంధి యిష్ట ము లేదు. ఏమిసంధి ? తెగి పోరి శత్రురాజులంద్రుంచి యీ తురుష్క రాష్ట్ర చతుష్టయమును మన విజయనగర సామ్రాజ్యమునం గల్పుకొంటయే నాకభిమతము.

వేంక:- అన్నగారూ! నిజమండి. ప్రథన భూమియందు. విజృ భించిన కంఠీరవంబులోయన, తురుష్కహరిణచయంబ లనుబట్టి చెఱకుఁ గఱలను నఱికినట్లు నఱుక నెంతయుఁ గా