పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియొకటవ ప్రకరణము


గలడా? మహమ్మదీయులు వట్టికుయుక్తి పరులు. దానిచేత నే వారిట్టి విజయములం గాంచుచున్నారు. నిశ్చయముగాఁ దలపోసి చూచినపక్షమున నేయుద్ధమున న్యాయము గా పోరి గెల్చినారు? వ్రేలుమడచి లెక్కించుఁడొక్కఁటేని కల దేమో?

మానవులలోఁ జాలమందికడ నొకవింతయిన స్వభావ మున్నది. ఆ గుణము కలవారికది స్ఫరింపదు. దానినే ఆత్మశక్తి విశ్వాస మనవచ్చును. అట్టి విశ్వాసముగలవాఁడు తనకేవిధ మైన యపజయమునుగల్గునని నమ్మడు. ఎట్టి వ్యవహారమునం దును శంకింపఁడు. ప్రతివిషయమునను దనకే జయము సిద్ధమని యు, పరాజయము తనకుఁగలలోఁ గూడఁ గలుగదనియు నతఁడు త్రికరణశుద్ధిగా నమ్మును. ఈవిశ్వాసముచేతనే కర్ణుఁడు తా నెన్ని సారులోడినను అర్జునుని జయింపఁగల్గుదు ననియే నమ్మెను. అత్యంత తీవ్రమగు పార్థుని తీక్ల ప్రహారమతని శిరమును ద్రుంచు వఱకు నతఁడా నమ్మకమును వీడ లేదు. ప్రపంచమున నమ్మి చెడిన వారిచర్యలను వారు చదువుదురు గాక! పఠింతురుగాక! వల్లింతు రుగాక ! దానిని మాత్రము స్వవిషయమునకు సంబంధింపఁ జేయరు. రారాజు దుర్యోధనుఁడీ యాత్మశక్తి విశ్వాసవశుఁడగు టం జేసియే, భీష్ముఁడు పడినను ద్రోణుఁడీల్గినను చతురంగ బల ములు హతమగు చున్నను, కాల్బలములు కాలిపోవుచున్నను, యుద్ధమును విడిచిన వాఁడు కొఁడు. రావణునకును, అందుచేత నే,