పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

238

విజయనగర సామ్రాజ్యము


ఆదిల్ : గుఱ్ఱములు మనవన్నియుకొంచెమించుమించుగానొక్క టే విధమైనవి. రామరాజు గుఱ్ఱములతోఁ బోల్పఁదగినవి కావు. అవి యతి శ్రేష్ఠములు. వి దేశములనుండి తెప్పించి నారు.

'అహమ్మద్: అవును. అశ్వశాస్త్రమును జదివిన పండితు లాం ధ్రులలోఁ జాలమందియున్నారు. రామరాజుకూడ ఆ శాస్త్రములో గొప్ప పండితుఁడని విఖ్యాతింగాంచి యు న్నాఁడు.

బేదర్ :- మన సైన్యమంతయుం గలిసి మొత్తము పదునొకండు లక్షల నలుబది వేలు. గుఱ్ఱములు తొంబది వేలు. ఏనుగ లిరు వదినాల్గువందలు. గుఱ్ఱములలోను, ఏనుగలలోను మనము కొంచెము తక్కునైనను కాల్బలములో మనమే చాల హెచ్చు. సుమారు మన కాల్బలము వారి కాల్బలమునకు రెట్టింపున్నది.

“ఆదిల్ :-కాని మన కాల్బల మా కాల్బలముతోఁ బోల్పఁదగినది కాదు.

బేదర్ : అది నిశ్చయ మే.

ఆదిల్ :- అందుచేతనే రాయ బారిని రేపే పంపి లోలోపల మన పనిని మనముచేయు చుండుట యుక్తము. అల్లా దయవలన మన మే గెలువ వచ్చును.మనకు ఫిరంగు లేడెన్మిది వందలు కలవు. వారికన్ని లేవు.