పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

236

విజయనగర సామ్రాజ్యము


గోల్కొండ: ఆఁ ! సిద్ధముగానే యున్నది. చక్రధరుని దగ్గజు నుండి సర్వము వ్రాసిన కాగితము వచ్చినది. అని యాకాగితముందీయ జేబులోఁ జేయి యుంచెను.

ఆదిల్ :- కాగిత మేల ! ముఖ్యమైనవి నేను చెప్పెదను వినండి. కాల్బలమాఱులక్షలు. అశ్వములు మొత్తము లక్ష.. ఏంగులు మూఁడు వేల యయిదువందలు. ఈ కాల్బలము తదితర బలములతోఁగూడ మూఁడు భాగములక్రింద విభజింపఁబడి నది. ఒక భాగము రామరాజు క్రిందను, మఱియొకటి తమ్ముఁడైన తిరుమల రాయని క్రిందను, ఉంపఁబడినవి. వీరు ముగ్గురు సర్వ సైన్యములకు నధ్యక్షులు.

గోల్కొండ నవాబింతలో కాగితముం దీసెను.

గోల్కొండ: అవును. ఆ మూవుర క్రిందను పదునై దుగురు ప్రధాన సైన్యాధిపతులును, వారి క్రింద తొంబది యేడు గురు సైన్యాధిపతులును గలరు. వారు తమ క్రిందనున్న నాల్గువందల ముప్పదిమంది యువసేనాపతులను జూచుచుం దురు. యుద్ధమునందు పరాజయమన్న మాట యెఱుంగక వేయికండ్ల తోను బది వేల హస్తములతోను పోరాడుచు బలముతో సమానముగా బుద్ధిబలముంగూడ నుపయో గింపఁజూలిన మహాయోధులు ముప్పది యార్గురు కలరు. వారికిం గొంచెము జంకువా రయిదువందలు కలరు. పౌరుష ప్రధానములయిన యుత్తమ వంశములంబుట్టి దేశ సేవ