పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

232

విజయనగర సామ్రాజ్యము


గోల్కొండ: ఆఁ! అంతవఱకుఁగాకున్నను, ఆ మహా సైన్యము లకు ఆటేడు కోట్లైనను వ్యయమై యుండును.

ఆదిల్ :-మనము మూఁడుకోట్లు చెప్పిన బాగుగా నుండును. అతఁడడమ మైదుకోట్లనయినను అడుగక మానఁడు. ఇట్ల నక ముందుగా హెచ్చు చెప్పిన నంతగా నతఁడు నమ్ము టకు వీలుండదు.

బేదర్ : సరే మూఁడుకోట్లు ధనము పైనఁ గొన్ని దుర్గములను గాని కొంత దేశమును గాని యీయవలయును.

అహమ్మద్ :- బీజపూరులోఁ గొంత భాగము నీయవలయును. అట్లయినచో "రామరాజునకుఁ దృప్తిగా నుండును.

గోల్కొండ:- గోల్కొండ బీజపూరులలో దక్షిణమున నున్న కొంత రాజ్యమును, కొన్ని దుర్గములను, ఇచ్చునట్లు చెప్పు దము.

ఆదిల్ :- అవు నిదియుక్తమే. కాని మఱియొకటి 'మనమడుగ వలయును. జగన్మోహినిని తిరిగి శ్రీగోల్కొండ నవాబుగారి కొప్పగించుటకుం గోరవలయును. ఇది వారికిం గష్టముగా నుండునని మన మెఱుంగుదుము. కాని ఇట్టిషరతు లేకు న్నచో, అంత బాగుండదు.

గోల్కొండ: నవాబుహృదయమునఁ గలుమనియెను. ఆ సుందరీమణి పేరు చెప్పగ నే యతనికి సహజమగు నుత్సుకత