పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

230

విజయనగర సామ్రాజ్యము


అహమ్మద్ :-అతఁ డే మైనాఁడు . అట్టి మంత్రి నేల రామరాజు విడిచెను?

ఆదిల్ శాహా:- తంత్రములు కల్పించి రామరాజునకును, అత నికిని విరోధము కల్గించితిమి. రామరాజవి నమ్మి యతనిం జెఱసాలలోనుంచినాఁడు. పిదపఁజంవుటకుఁ బ్రయత్నము చేసితిమి. కాని సాగినది కాదు. అయినను, అతఁడిపు డిఛట లేఁడు. ఢిల్లీకిబోయినట్లు తెలియవచ్చినది.

గోల్కొండ:- అతని జాడ తెలిసినది కాదు. అతఁడు ఢిల్లీ కేల పోయియుండెనో ?

ఆదిల్ :-ఉద్యోగమునకు పోయియుండును.

బేదర్ : అంతేనా? ఢిల్లీశ్వరుని సాయమడుగుటకా !

ఆదిల్ :-కాఫరులకు వారు సాయము చేయరు. అతనిం బట్టి ఖయిదు వేయించునట్లు నేను జేసెదను.

బేదర్ :-ప్రస్తుతమున్న మంత్రి యెవరు ?

గోల్కొండ: ప్రస్తుతమున్న వాఁడు మనవాఁడే. మనయాటలు సాగుటకు నదియే కారణము. అట్టిసాహాయ్యమే లేకయు న్నచో మనము నల్గురముకలసినను, ఈ యాంధ్రచక్ర వర్తిని జయించుట దుర్గటము. అతని పేరు చక్రధరుఁడు.

మహమ్మద్ :- చక్రధరుఁడీ కుట్రలోఁ జేరుటకుం గారణ మేమి ? రామరాజు మంత్రులను మిక్కిలి మన్నించుననియు హరిదుర్ఘల