పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

విజయనగర సామ్రాజ్యము


అని నిట్టూర్పు వుచ్చెను. అత్యంత వైభవము ననుభ ఖించి విమత నృపాలురకు 'భీకరంబులై జగద్విఖ్యాతి గాంచిన సామ్రాజ్యములలో విజయనగర సామ్రాజ్య మొకటి. ఉచ్చదశ యందది. దక్షిణ హిందూ దేశములోఁ • జాలభాగమువలకు వ్యాపించి తన యపారసాహస వంతులగు భటుల చేతను, సేనా ధిపుల చేతను, , మేధానిధులగు మంత్రి సత్తములచేతను, నిత్య విజయ విభవవిభాసురులగు రాజ మార్తాండుల చేతను, విపతు లగు యవనావనీధవుల గుండియలు బ్రద్దులు వోవఁ జేసినది. తదితర హిందూనృపులకు వంద్యమై కాలినది.


ఆసామ్రాజ్య మెవ్వరిది ! విపక్ష ద్విరడ మృగేంద్రులగు నా రాజు లెవరు ? పాఠకులారా ! ఆసామ్రాజ్యము మీది. మీ పూర్పులు, పరాక్రమ విజత వితత విపశులు, దానిని స్థాపించి నారు. దానిని స్థాపించిన వారాధ్రులు. పరిపాలించిన వారాం ధ్రులు. ఆంధ్రు లా సామ్రాజ్యమునకు. మంత్రులై వన్నె కెక్కిరి. ఆ సామ్రాజ్యముంగూర్చి, యా ప్రభువులంగూర్చి యామంత్రులంగూర్చి, నేఁటికిని మన పెద్దలు గృహములలో వర్ణించుచుండఁగా మీరు విన లేదా ! కృష్ణరాయల శౌర్య సంపత్తిని, తిమ్మరుసు బుద్ధివైభవమును, పసిపిల్ల లుగూడ నేటి కిని గీర్తించుచుండుట లేదా ?


అట్టి యుత్కృష్ట సామ్రాజ్య నిర్వాహకుల వంశముల జన్మించిన యో పాఠకులారా ! 'ప్రస్తుత సామ్రాజ్యమునకుఁ