పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదివ ప్రకరణము

229


ఆదిల్ : మీరు చెప్పిన యీయుక్తి సంస్తవనీయమే. కాని మొదట ఈ యుద్ధ చతురంగమునకు వేఱొక యెత్తు వేసి చూడవలయును.

అహమ్మద్ : అదియేదో సెలవియ్యండి.

ఆదిల్ : మనము మొట్ట మొదట నొక టక్కుచేయుదము. మన సైన్యములను పైకి యుద్ధమున కాయత్తము కానట్లు నటింపించుచు లోన సర్వసన్నద్ధుల మైయుండుచు రామ రాజున కొక రాయ బారి నిట్లు చెప్పుట కంపుదము. “చక్ర నర్తులైన తమ సైన్యముంజూచి నవాబులు భయపడినారు. కావున వారియందు దయయుంచి సంధి కొడంబడుఁడు' అతనికి స్వాభావికముగా నమ్మకము విస్తారము. అదియు నుంగాక స్వశక్తియందతనికి విశ్వాసము మెండు.

బేదర్ :-బ్రాహ్మణులన్న జ్ఞప్తికి వచ్చినది. అతనిదగ్గఱ విశ్వ విఖ్యాతిగాంచిన బుద్ధిసాగరుఁ డను మంత్రియున్నాఁడట. అతఁడు మేధానిధియనియు, అత్యద్భుత శక్తిమంతుఁ డనియు, యుక్తిసందోహములకును దంత్రములకు నివాస స్థానమనియు వింటిని. అట్టివాఁడీ తంత్రములను సాగ నిచ్చునా?

'మనతంత్రముల సాగనిచ్చునా ?

గోల్కొండ:- అతఁడిపుడు లేఁడు లెండు. అతఁడే యున్నచో మన తంత్రములను సాగనిచ్చునా?