పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

224

విజయనగర సామ్రాజ్యము


విశాలములగు సభామందిర స్థానములును, పెద్ద పెద్ద గదులును కలవు. అవి నానాలంకార శోభితములై యుండెను. ప్రకృతి సౌందర్య సర్వస్వ ని కేతనము లైన యవనికలును, పట్టు నింపఁ బడిన ముఖ్ మల్ పరపులును, సుందరములయిన సోఫా లును గలవు. అవి నవాబుల మందిరములు. అట్టిదే అతి విశా లమైన గుడార మొక్కటి, ఈ సైన్యములకు మిక్కిలిదూర ముగాఁ గృష్ణా స్రవంతీ సమీపమునం గట్టఁబడెను. దాని చుట్టును నాలుగైదు ప్రాకారము లుండెను. ఆ ప్రాకారముల చుట్టు వేలకొలఁది భటులు గావలి యుండిరి. దానికి నచ్చు టకు, ఆ సైన్యములోని భిన్న భిన్న స్థలములనుండి వచ్చు బాటలు పెక్కు గలవు. ఆ బాటలు మనోహరములుగా నుం డెను. ఆ మందిరముయొక్క భూమి యెల్ల రత్నకంబళులతోను నానావిధములగు తీగెలును బూవులును జిత్రింపఁబడిన తివా సీలతోను, అలంకరింపఁబడియుండెను.మనోహరముగాఁ జిత్రిం పఁబడిన చిత్ర చిత్రములగు తెరలు పెక్కులుండెను. ఆ తెర లలోఁ జిత్రింపఁబడిన సుందరీమణులు జీవించిన వారివ లెనే కన్పట్టుచు నుండిరి. అందలి కుడ్యము లెల్ల రమ్యములగు విచిత్ర వస్తువులచే నలంకరింపఁబడి చిత్రనస, ప్రదర్శనశాలలోయన నొప్పుచుండెను. తన్మంది రోపరిభాగమెల్లఁ జ్యా. 3సీలతో నొప్పుచుండెను. అవి పట్టువస్త్రములతో నిర్మింపఁబడి పెక్కు విధములయిన దీపములతో నొప్పుచుండెను.