పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియవ ప్రకరణము

223


గోల్కొండ, అహమ్మద్ నగరు, బేదరు, బీజపూరు నవాబులు పరస్పరము ప్రోత్సాహపఱచుకొని రామరాజుతో మత యుద్ధముచేయ నిశ్చయించి, పెద్ద పెద్ద సైన్యములం కొని తమతమ రాజ్యములనుండి బయలు దేరివచ్చి యిచ్చట విడిసిరి. ఆ స్థలమునఁ గొప్పవిశాల మైన బయళ్లు కలవు. అవి యీ సైన్యసముద్రములకు చాల వీలుగా నుండెను. ఆ సైన్య ములలోనున్న గుఱ్ఱములకును, ఇతర పశువులకును గావలసిన గడ్డి యెల్ల నచ్చటకుఁ జుట్టునున్న ప్రదేశములలో దొరకు చుండెను. పెక్కు మైళ్ల వఱకుఁ దెల్లని శిబిరములతో నిండి యుండెను. ఆ శిబిరముల మధ్య విశాలము లైన బజారులుండెను. ఒక్కొక్క పెద్ద బజారునకును, మఱియొక బజారునకును మధ్య నున్న శిబిరముల లోనిభటు లెల్లరు నొక సైన్యాధ్యక్షు నధీన మున నుండిరి. అట్టి బజారులు వేలకొలఁదిగా నుండెను. కొంద ఆుద్యోగస్థు లెప్పుడును, ఆ సై నికులను వారిపై అధ్యక్షులను గని పెట్టుకొని అప్పుడప్పుడు వచ్చి పరీక్షించుచుండిరి. మధ్య ప్రదేశముల నంగళ్లుంచిరి. ఇట్లా ప్రదేశమంతయు నూతన ముగాఁ గట్టఁబడిన యొక గొప్పపట్టణమువలె నుండెను.


ఆ శిబిరముల మధ్య భాగమున, అత్యున్న తములును, అతి మనోహరములును, అయిన గుడారములుండెను. అవి విశుభ్ర కాంతులచేఁ దళదళ మెఱయుచుండెను. లోనఁబ్రవే శించి చూచువారి కవి గుడారములవలెఁ గన్పట్టవు.వానిలో