పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది తొమ్మిదవ ప్రకరణము

221


అచ్చట కప్పుడు రాధాకునూరుఁడు వచ్చెను. ఆయోధ వీరు లిరువురు గుఱ్ఱముల నధిష్టించిరి. స్వర్ణకుమారి విజయ సింహుని గుఱ్ఱమున కడ్డమువచ్చెను. “బావా ! సెలవు దయ చేయరా!' అని ప్రార్థించెను. కాని యతఁడు వలను కాదనెను. ప్రేమ మిక్కిలి చెడ్డది. అది బలమైనది. అమృతమయ మైనది. అది యీశ్వరదత్తము. దాని స్వభావము మన కగమ్య గోచరము. అది త్రాళ్ళు లేకయె బంధించును. త్రాటితో గట్టిన బంధనముల నితరులు తెంపవచ్చును. కాని యాబంధ నములఁ దెంపుటకు మాత్రము ప్రపంచమున నెనరికిని సాధ్య ముకాదు.

ఆ సుందరీమణుల విలాస దృక్కు లాసుందరుల చెక్కుల పైకిఁబ్రాకి ముద్దు పెట్టుకొను చుండెను. ఆ సుందరుల చూపులు నాషనినే కావించుచుండెను. వారొండొరులను విడువ లేక విడి చిరి. దృష్టిపథమును దాటునందాఁక చూచిరి. కన్ను లనీరు నిం, చుచుఁ బరస్పరము ప్రేమతో భాషించుకొనుచుఁ జనిరి.