పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

220

విజయనగర సామ్రాజ్యము


కాదా? పవిత్రమగు జొహారుగాని, తీక్షములగు ఖడ్గములుగాని యున్నంతకాలము హిందూ సుందరీమణులకు మానభంగ భయము కలుగ నేర్చునా ? నాధా ! చిన్నప్పటినుండియు నుదారాశయములతోఁ బెరిగితిమి. సమాన సుఖదుఃఖముల ననుభవించితిమి. స్నేహితురాలను. దాసురాలను. మీ యాజు వహించుట నాధర్మము. విజయనగర సామ్రాజ్య రక్షణకై నాయోపినంత సాయమును జేయుట కేను తగనా ! ఈ భిక్షను నాకుం బ్రసాదింపరా ? "


అని ఆమె చెయిసాచి పెక్కువిధముల నతనిం బ్రార్థించెను. అతఁడు పెక్కు విధముల చెప్పిచూచెను. కాని సరి యైన సమాధానములు మాత్ర మొసంగఁ జాలకపోయెను. యోజించి యోజించి చూచెను. కాని యతఁడెందు వలననో యామెకోరిక ననుమతింపలేదు.


స్నేహితురాలా ! నీ హృదయమంతయు నే నెఱుం గుదును. కాని నిన్ను యుద్ధమునకు నేనిపుడు నాతోఁ దీసికొని పోవలనుపడదు. అందులకుఁ దగినంత కారణము కలదు. నాకు సెలవీమ్ము. పోయిన చ్చెదను'


మఱి యిఁకలాభము లేదని తలఁచెను. ఇంక నామె యతని నాకోర్కెకోరలేదు. కాని మనసున మాత్ర మేమో యోజించుకొనెను.