పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

విజయనగర సామ్రాజ్యము


శ్రీధ:-మా యజ్ఞ యాగా దికములమాట కేమిలే ! సుస్థిరమగు విజయనగర సామ్రాజ్యలక్ష్మికి మీఁబోటి మంత్రులును, రామరాజువంటి చక్రవర్తులును గలుగ, మాబోంట్లకు భయ మేమి! కాని, మీరాజ్య కార్యము లెట్లు సాగుచున్న వి?

బుద్ధిసాగరుఁడు తలకొంచెమువంచెను. అతని మొగము సరిగాఁ గనఁబడుట లేదు. కాని, యతని మొగమున నెంత చూచినను మార్పేమియుఁ గాన వచ్చుట లేదు.

“ రాజ్యకార్యములం గూర్చియే నీతో నిప్పుడు మాట లాడవచ్చితిని. కొంచెము కాలము మనము మాటలాడవలసి. యున్నది. కొన్ని చిక్కులు తటస్థించినవి” అని మెల్లగా బుద్ధి సాగరుఁడనెను.

శ్రీధరుని కేమియుఁ దోఁచ వేదు. అతనికి యోచనలు సెక్కులు గలుగఁజొచ్చెను. సర్వమును విసర్జించిన సన్యాసి .కీవ్యవహారము లన్నియు నేలకో ? శ్రీధరుఁడటునిటు పరికించి చూచెను. బుద్ధిసాగరుఁడును విలోకించెను.

బుద్ధిసాగరా ! అదిగో ! ఆకనఁబడుచున్న ప్రదేశము రహస్యాలోచనమునకు మిక్కిలి మంచిది. కాన నటకుఁబోవు. దమురా” అనియెను. ఇద్దఱును బోవఁదొడఁగిరి. వారిరువురు నొకరితో నొకరు మాటలాడ లేదు. కను లెత్తి యచ్చటి ప్రకృతి సౌందర్యము నరయ లేదు. మెల్ల మెల్లఁగ శ్రీధరుఁడు ముందు