పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది యెనిమిదన ప్రకరణము

211


అంతవఱకుఁ జదివెను. మంత్రిక న్నీరు విడిచెను.


'కాఫరులను హింసించి తురకమతము నంగల్పుకొమ్మని దైవమువిధించెను. కాఫరులే తురక మతమునకు హానిచేయు చున్నారు. కాల, మెంతమారినది. అగుఁగాక! దైవమా ! మంచి కాలమువచ్చినది. మా నవాబు లెల్ల మరల నీ పరిశుద్ధ మృతమును స్థాపింపఁ బూనుచున్నారులే'. --


నవా:- ఆహా ! దైవమా ! అల్లా ! పూర్వము మాతాతలు మతముకొఱకై పాశ్చాత్యుల నెదిరించి విఖ్యాతినందిరి. ఇపుడు మాకీ మత యుద్ధములోఁగూడ విజయమిప్పించు ము. మాకిట్టి యైకమత్యమును మిమతము రోజుకిచ్చి సందులకు వందనములు.

అతఁడు మరలఁ జదువఁదొడఁగెను.

"మన మతధ్వంసమున కోర్వజాలక మనము యుద్ధ 'మునం బ్రవేశింప వలసి వచ్చినది. కాఫరులను ధ్వంసము చేసి స్వర్గమును బొందవచ్చును. కావున మీ సైన్యములను వెంటనే తాళికోట ప్రాంతములకుం దెప్పింపఁ బ్రార్థించుచున్నాను. శత్రువులు కూడ నాప్రాంతములనే విడియుదురని వాడుక. త్వరితము-త్వరితము.

చిత్తగింపుఁడు.”